osmania university: ఓయూలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా.. 12 మంది అరెస్ట్‌

12 arrested in osmania fake certificates case

  • సీసీఎస్ ఆధ్వ‌ర్యంలో సిట్‌
  • ఇప్ప‌టికే 12 మంది అరెస్ట్‌
  • ఎస్ఆర్కే వ‌ర్సిటీ సిబ్బందే కీల‌క సూత్ర‌ధారుల‌ని అనుమానం

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్.. సీసీఎస్ ఆధ్వ‌ర్యంలో ప్రత్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన సిట్.. ఇప్ప‌టికే 12 మంది నిందితుల‌ను అరెస్ట్ చేసింది.

ప్ర‌త్యేకించి ఈ న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందాకు ఎస్ఆర్కే యూనివ‌ర్సిటీ సిబ్బందే కార‌ణ‌మ‌ని కూడా సిట్ గుర్తించిన‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన ప్రాథ‌మిక స‌మాచారాన్ని అందుకున్న సిట్.. త‌దుప‌రి ద‌ర్యా‌ప్తును ఎస్ఆర్కే యూనివ‌ర్సిటీకి చెందిన సిబ్బంది కేంద్రంగా సాగించ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

osmania university
Hyderabad police commissioner
cv anand
  • Loading...

More Telugu News