apsrtc: వరుసగా నాలుగో సారి ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ అవార్డు
- డిజిటల్ సేవల్లో సత్తా చాటుతున్న ఏపీఎస్ఆర్టీసీ
- ఈ సేవలకు ఇప్పటికే మూడేళ్ల పాటు డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు
- తాజాగా ఈ ఏడాది కూడా అవార్డును దక్కించుకున్న వైనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కి జాతీయ అవార్డు దక్కింది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడు అవార్డులను కైవసం చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానం ద్వారా అవార్డును అందుకున్నారు.
డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సంస్థలకు డిజిటల్ టెక్నాలజీ సభ ఏటా అవార్డులు ఇస్తోంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీల్లో ఏపీఎస్ఆర్టీసీ సత్తా చాటుతోంది. ఏటా ఈ అవార్డు కోసం పలు రాష్ట్రాలకు చెందిన సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే డిజిటల్ సేవల్లో ఇప్పటికే వరుసగా మూడేళ్ల పాటు పలు జాతీయ సంస్థలతో పోటీ పడి మరీ డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డులను కైవసం చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ అవార్డును దక్కించుకుంది.