Akash Puri: 'చోర్ బజార్' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్!

Chor BaZaar title song released

  • లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన ఆకాశ్ పూరి 
  • మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు 
  • జీవన్ రెడ్డి దర్శకత్వంలో 'చోర్ బజార్'
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  

ఇంతవరకూ ఆకాశ్ పూరి ప్రేమకథా చిత్రాలు చేస్తూ వచ్చాడు. ఇటీవల ఆయన చేసిన 'రొమాంటిక్' కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక కాస్త మాస్ యాక్షన్ వైపు కూడా తన సత్తా చాటాలనుకున్న ఆకాశ్, 'చోర్ బజార్' సినిమాను చేశాడు. 'జార్జి రెడ్డి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పాత బస్తీలో హీరో తన టీమ్ తో కలిసి దొంగతనాలు చేస్తుండటంపై ఈ టైటిల్ సాంగ్ నడుస్తుంది. సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటను అసుర .. సెల్విన్ ఫ్రాన్సెస్ .. శ్రుతి రంజని కలిసి ఆలపించారు. ఇది ర్యాప్ సాంగ్ అయినప్పటికీ సాహిత్యం అర్థం కాదు .. గందరగోళంగా అనిపిస్తుంది.

హైదరాబాద్ పాత బస్తీలో హీరో .. అతని బృందం దొంగతనాలు చేసి చోర్ బజార్లో అమ్మేస్తుంటారనే విషయం మాత్రం విజువల్స్ పరంగా అర్థమవుతుంది. వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాతో తెలుగు తెరకి గెహెనా సిప్పీ కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News