Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేసిన కాంగ్రెస్ నేత పొన్నాల

Congress leader Ponnala Lakshmaiah satires in KCR
  • థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు
  • దేశాన్ని ఏంచేయాలనుకుంటున్నారన్న పొన్నాల
  • తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శ 
  • థర్డ్ ఫ్రంట్ ఓ భ్రమగానే మిగిలిపోతుందని వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల థర్డ్ ఫ్రంట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండడం పట్ల కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఓ భ్రమగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే... కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణను అన్ని విధాలుగా నాశనం చేసి, ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారని పొన్నాల విమర్శించారు. అసలు దేశానికి నాయకత్వం వహించేంత బలం కేసీఆర్ కు ఉందా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెబుతున్న 'బంగారు భారత్' నినాదం వింటుంటే నవ్వొస్తోందని అన్నారు.
Ponnala Lakshmaiah
KCR
Satires
Third Front
Telangana

More Telugu News