KIA Motors: కియా ఇండియా ఘ‌న‌త‌.. 2.5 ఏళ్ల‌లో 5 ల‌క్ష‌ల కార్లు

Kia India achieves record production

  • అనంత‌పురం జిల్లా పెనుకొండ వ‌ద్ద ప్లాంట్‌
  • ఇప్ప‌టిదాకా 5 ల‌క్ష‌ల కార్ల ఉత్ప‌త్తి
  • 4 ల‌క్ష‌ల కార్లు భార‌త్‌లో, ల‌క్ష కార్లు విదేశాల‌కు ఎగుమ‌తి
  • దేశీయ మార్కెట్‌లో 25 శాతం వాటా కియా ఇండియాదే

కొరియా కార్ల త‌యారీ కంపెనీ కియా భార‌త్‌లో స‌త్తా చాటుతోంది. ఏపీలోని అనంత‌పురం జిల్లా పెనుకొండ స‌మీపంలో కార్ల త‌యారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్న కియా శ‌ర‌వేగంగా కార్ల ఉత్ప‌త్తిని చేప‌డుతోంది. ఉత్ప‌త్తి మొద‌లైన అనతికాలంలోనే త‌న‌దైన మార్కు స్పీడుతో దూసుకుపోయిన కియా.. కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే ఏకంగా 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేసి రికార్డు నెల‌కొల్పింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు కియా ఇండియా నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

పెనుకొండ ప్లాంట్‌లో ఇప్ప‌టిదాకా 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేశామ‌ని, వీటిలో ఏకంగా 4 ల‌క్ష‌ల కార్ల‌ను భార‌త్‌లోనే విక్ర‌యించామ‌ని స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో కియా ఇండియా తెలిపింది. మ‌రో ల‌క్ష కార్ల‌ను విదేశాల‌కు ఎగుమతి చేసిన‌ట్టుగా ఆ సంస్థ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లో త‌మ వాటా 25 శాతానికి పెరిగింద‌ని, ఈ మార్కును తాము కేవ‌లం రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలోనే సాధించామ‌ని కూడా ఆ సంస్థ పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News