Amitabh Bachchan: ప్రభాస్ 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్ కి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్

Bollywood legend Amitabh Bachchan lends his voice for Prabhas Radhe Shyam

  • ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్
  • రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం
  • అమితాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన యూవీ క్రియేషన్స్

ఇటీవల కాలంలో సినిమాల్లో వాయిస్ ఓవర్ టెక్నిక్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. సినిమాలో కొన్ని సీన్లు అదనంగా చేర్చేందుకు బదులు వాయిస్ ఓవర్ ద్వారా ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసే ప్రక్రియను చాలామంది దర్శకులు ఫాలో అవుతున్నారు. కొందరు అగ్రశ్రేణి హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించడం వల్ల మార్కెట్ పరంగా ఎంతో లాభిస్తోంది.

తాజాగా, ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గొంతు అరువిచ్చారు. రాధేశ్యామ్ చిత్రానికి అమితాబ్ వాయిస్ ఓవర్ చెప్పారని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. థాంక్యూ షహెన్ షా అంటూ ట్విట్టర్ లో అమితాబ్ కు కృతజ్ఞతలు తెలిపింది.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీతో పాటు అనేక భాషల్లో రిలీజవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News