Balakrishna: ఇంతవరకూ చేయని పాత్రలో బాలయ్యను చూపించనున్న కొరటాల!

Balakrishna in Koratala movie

  • 'ఆచార్య'ను రిలీజ్ కి రెడీ చేసిన కొరటాల
  • ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • ఆ తరువాత ప్రాజెక్టు బాలకృష్ణతోనే
  • ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందంటూ టాక్  

బాలకృష్ణ ఇమేజ్ .. ఆయన క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఇటీవల వచ్చిన 'అఖండ' నిరూపించింది. సరైన కథ పడితే బాక్సాఫీస్ దగ్గర ఆయన జోరు ఎలా ఉంటుందనేది మరోసారి స్పష్టమైంది. దాంతో స్టార్ డైరెక్టర్లు ఆయనతో సినిమా చేయడానికి మరింత ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఆయనతో సినిమా చేయనున్న దర్శకుల జాబితాలో కొరటాల పేరు కూడా చేరిపోయింది.

ప్రస్తుతం కొరటాల 'ఆచార్య' సినిమా విడుదలకి సంబంధించిన పనులను చూసుకుంటూనే, ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన పనులను కూడా చక్కబెడుతున్నారు. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతోనే చేయనున్నట్టు ఒక వార్త బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయన బాలకృష్ణకి కథ వినిపించడం .. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.

ఇంతవరకూ బాలకృష్ణని చూడని ఒక పాత్రలో .. లుక్ తో ఆయనను ఈ కథలో చూస్తారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కూడా కొరటాల మార్క్ సందేశం ఉంటుందని అంటున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాను కూడా పూర్తిచేసిన తరువాత కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Balakrishna
Gopichand Malineni
Kortala Movie
  • Loading...

More Telugu News