Tejashwi Yadav: ఇదే చివరి జడ్జిమెంట్ కాదు.. మాకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి: తేజశ్వి యాదవ్
- దాణా స్కామ్ కేసులో లాలూకు శిక్ష విధించిన సీబీఐ కోర్టు
- సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామన్న తేజశ్వి
- హైకోర్టులో తీర్పు మారుతుందనే నమ్మకం ఉందని వ్యాఖ్య
దాణా స్కామ్ కు సంబంధించిన ఐదో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ కోర్టు శిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై లాలూ కుమారుడు, బీహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... కోర్టు తీర్పుపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని చెప్పారు.
అయితే ఇదే చివరి జడ్జిమెంట్ కాదని... తమకు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఉన్నాయని అన్నారు. సీబీఐ కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని... హైకోర్టులో తీర్పు మారుతుందనే ఆశాభావం తమలో ఉందని చెప్పారు.