Pawan Kalyan: మత్స్యకారుల సభకు వస్తున్నానని ప్రభుత్వం చక్కని ఏర్పాట్లు చేసింది: పవన్ కల్యాణ్ సెటైర్లు

Pawan Kalyan satires on AP Govt

  • రోడ్డంతా గోతులేనని వెల్లడి
  • పడవ ప్రయాణం చేసినట్టుగా ఉందని వ్యంగ్యం
  • ఉత్సాహంగా మాట్లాడలేనేమోనని ఛలోక్తి

నరసాపురంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల అభ్యున్నతి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తన ప్రసంగం ఆరంభంలోనే ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తాను మత్స్యకారుల సభకు వస్తుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లంతా గతుకులు, గొయ్యిలు తీసిపెట్టిందని, దాంతో పడవ ప్రయాణం చేసినట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ కారణంగా సభలో ఉత్సాహంగా మాట్లాడలేనేమోనని ఛలోక్తి విసిరారు.

"మత్స్యకారుల సభ కాబట్టి పడవ ప్రయాణాన్ని తలపించేలా చక్కని ఏర్పాట్లు చేసింది. రోడ్లపై గోతులు తీసింది. చక్కని అభివృద్ధి! ఈ ప్రయాణంతో మాయాబజార్ చిత్రంలోని లాహిరి లాహిరి పాట గుర్తొచ్చింది" అంటూ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan
AP Govt
Fishermen Meeting
Narasapuram
  • Loading...

More Telugu News