Kim Jong Un: వ్యవసాయ ప్రాజెక్టుకు బాంబులతో భూమిపూజ చేసిన కిమ్
- ఉత్తరకొరియాలో కూరగాయలకు కొరత
- అధికమంచుతో పంటలు పండని వైనం
- భారీ గ్రీన్ హౌస్ ఏర్పాటుకు శ్రీకారం
- తనదైన శైలిలో కిమ్ ప్రారంభోత్సవం
ఉత్తర కొరియాలో శీతాకాలం వచ్చిందంటే కూరగాయల కొరత తీవ్రతరం అవుతుంది. శీతాకాలంలో అక్కడ అత్యధిక స్థాయిలో మంచుకురుస్తుంది. వ్యవసాయ పనులేవీ ముందుకు సాగవు. దాంతో, చలికాలం ముగిసేవరకు అక్కడి ప్రజలకు పచ్చళ్లు, ఎండబెట్టిన కూరగాయలే దిక్కు. అయితే, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దీనికి ఓ పరిష్కారం చూపాలని సంకల్పించారు.
ఓ భారీ గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసి, దాంట్లో కూరగాయలు పండించాలని నిర్ణయించారు. అందుకోసం పలు అంతర్జాతీయ కంపెనీలు, స్థానిక సంస్థల సహకారం తీసుకున్నారు. ఈ గ్రీన్ హౌస్ లో ఏడాది పాడవునా, వాతావరణంతో సంబంధం లేకుండా అనేక రకాల కూరగాయలు, ఆకు కూరలు పండించవచ్చు.
ఇక కిమ్ సంగతి తెలిసిందే! ఏదైనా ఆర్భాటంగా ఉండాల్సిందే! అందుకే, ఈ గ్రీన్ హౌస్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో బాంబులతో పేల్చి భూమిపూజ చేశారు. స్వయంగా పార చేతబట్టి మట్టి ఎగదోశారు. గతంతో పోల్చితే చాలా బరువు తగ్గిన కిమ్... ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించారు. అధికారులను ప్రోత్సహిస్తూ, అభినందన పూర్వకంగా చప్పుట్లు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.