CM Jagan: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్

- కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- విట్రియో రెటీనా కంటి ఆసుపత్రి ప్రారంభం
- ఆపై అంజాద్ బాషా తనయ పెళ్లి వేడుకకు పయనం
- వధూవరులను ఆశీర్వదించిన వైనం
ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన అనంతరం సీఎం జగన్ గన్నవరం బయల్దేరారు.


