Viral Pics: అత్తారింటికి వెళ్లేముందు ఓటు వేసిన కొత్త పెళ్లి కూతురు.. ఫొటో వైరల్
- యూపీలో ఘటన
- గత రాత్రి పెళ్లి
- నేడు అత్తారింటికి వధువు
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు యూపీలో మూడో విడత పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. గత రాత్రి పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి ఈ రోజు ఉదయం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం గమనార్హం.
ఫిరోజాబాద్ లోని 350వ నంబరు పోలింగ్ కేంద్రానికి తన భర్తతో కలిసి వెళ్లిన ఆమె ఓటు వేసి అనంతరం అక్కడ భర్తతో ఫొటో తీసుకుంది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అత్తారింటికి వెళ్లే ముందు ఆమె సొంత గ్రామంలో ఓటు వేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.