Chinni Krishna: నాపై దాడి చేశారు: పోలీసులకు సినీ రచయిత చిన్ని కృష్ణ ఫిర్యాదు

Tollywood writer Chinni Krishna approaches police
  • నా స్థలాన్ని ఆక్రమించుకున్నారు
  • కోర్టులో ఫిర్యాదు చేసినందుకు నాపై దాడి చేశారు
  • దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకర్ పల్లి గ్రామ పంచాయతీలో తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.



Chinni Krishna
Tollywood
Attack

More Telugu News