Pawan Kalyan: కళాతపస్వి కె.విశ్వనాథ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys birthday wishes to K Viswanath
  • నేడు కె.విశ్వనాథ్ పుట్టినరోజు
  • ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
  • ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారని వెల్లడి
  • తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని కలిగిన దర్శకుడని కితాబు
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కె.విశ్వనాథ్ ఒకరు. సామాజిక సమస్యలను స్పృశిస్తూనే, వాణిజ్యపరంగానూ హిట్ చిత్రాలు తీయడం ఆయనకే చెల్లింది. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ ఆయన ఉన్నతస్థాయిలో నిలిచారు. కళాతపస్వి అనిపించుకున్నారు. కాగా, ఇవాళ కె.విశ్వనాథ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.

కళాతపస్వి విశ్వనాథ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని కలిగిన దర్శకులు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం... ఇలా ఆయన ఎన్నో ఆణిముత్యాల వంటి చిత్రాలను తెలుగు చిత్రసీమకు అందించారని కీర్తించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు, తెలుగు భాషను వెండితెరపై ఆయన ఆవిష్కరించిన విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశ్వనాథ్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Pawan Kalyan
K Viswanath
Birthday
Tollywood

More Telugu News