TSSPDCL: తెలంగాణలో త్వరలోనే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు!

Discoms decided to fit prepaid current meters

  • టీఎస్ఎస్పీడీఎస్ పరిధిలో ఇప్పటికే 22 వేల ప్రీపెయిడ్ మీటర్లు
  • ఆసక్తి చూపని వినియోగదారులు
  • టారిఫ్‌లో రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని డిస్కంలు నిర్ణయం

తెలంగాణలో త్వరలోనే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న పోస్టు పెయిడ్ విధానం నుంచి ప్రీపెయిడ్‌గా మార్చాలని డిస్కంలు యోచిస్తున్నాయి. దశల వారీగా ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రీపెయిడ్ మీటర్లను బిగించుకునేందుకు వినియోదారులు ముందుకు రాకపోవడంతో చార్జీల్లో రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటి వరకు 22 వేల ప్రీపెయిడ్ మీటర్లను మాత్రమే బిగించారు. అయితే, ప్రీపెయిడ్‌తోపాటు సాధారణ రీడింగ్ కూడా తీస్తుండడంతో వినియోగదారులు రెండో దానినే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రీపెయిడ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు, కొత్త ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు విద్యుత్ టారిఫ్‌లో రాయితీలు ఇవ్వాలని డిస్కంలు భావిస్తున్నాయి.

సగటున ఒక్కో కనెక్షన్‌పై ఎంత భారం పడుతుందో అంచనా వేసి ఆ మేరకు ప్రీపెయిడ్ మీటర్ వినియోగదారులకు చార్జీల్లో రాయితీలు ఇచ్చుకోవచ్చని కేంద్రం ఇప్పటికే చెప్పడంతో డిస్కంలు ఆ దిశగా యోచిస్తున్నాయి.

  • Loading...

More Telugu News