Virat Kohli: టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli equals Rohit Sharma record

  • వెస్టిండీస్ తో రెండో టీ20లో కోహ్లీ ఫిఫ్టీ
  • టీ20 ఫార్మాట్లో కోహ్లీకిది 30వ అర్ధసెంచరీ
  • 30వ అర్ధసెంచరీలో రోహిత్ శర్మ పేరిట రికార్డు
  • రోహిత్ సరసన నిలిచిన కోహ్లీ

వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. 41 బంతులాడిన కోహ్లీ 52 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో కోహ్లీకి ఇది 30వ అర్ధసెంచరీ. ఈ అర్ధసెంచరీ సాయంతో కోహ్లీ... రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ పేరిట 30 అర్ధసెంచరీల రికార్డు ఉంది. తాజా ప్రదర్శనతో కోహ్లీ కూడా రోహిత్ సరసన నిలిచాడు.

అయితే, టీ20 ఫార్మాట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లీనే. కోహ్లీ ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో 10,221 పరుగులు సాధించాడు. ఓవరాల్ గా టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (14,529), షోయబ్ మాలిక్ (11,611), కీరన్ పొలార్డ్ (11,419), ఆరోన్ ఫించ్ (10,434), డేవిడ్ వార్నర్ (10,308) ఉన్నారు.

Virat Kohli
Rohit Sharma
Record
Fiftes
T20
  • Loading...

More Telugu News