Bheemla Nayak: సెన్సార్ పూర్తి చేసుకున్న 'భీమ్లా నాయక్'
- పవన్ కల్యాణ్ హీరోగా భీమ్లా నాయక్
- U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- ఈ నెల 25న రిలీజ్
- 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్!
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో వారం రోజుల్లో విడుదల కానుండగా, చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21న ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందని సమాచారం.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ ఓ పోలీసాఫీసర్ పాత్ర పోషించారు. రానా మెయిన్ విలన్ గా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాశారు.