CM Jagan: ఆదివారం కడప, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

CM Jagan will tour in Kadapa and Visakha district
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
  • పుష్పగిరిలో ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభం
  • అంజాద్ బాషా కుమార్తె పెళ్లి వేడుకకు హాజరు
  • అదే రోజు సాయంత్రం విశాఖకు పయనం
  • రాష్ట్రపతికి స్వాగతం చెప్పనున్న ముఖ్యమంత్రి 
సీఎం జగన్ ఎల్లుండి కడప, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కడప చేరుకుంటారు. పుష్పగిరిలోని విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆపై కడప నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. విశాఖలోని ఐఎన్ఎస్ డేగా వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
CM Jagan
Kadapa District
Visakhapatnam District
Tadepalli
YSRCP
Andhra Pradesh

More Telugu News