Pavan Kalyan: 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్ మామూలుగా లేదే!

Bheemla Nayak movie update

  • ఈ నెల 25వ తేదీన 'భీమ్లా నాయక్'
  • మార్చి 4వ తేదీకి వెళ్లనున్న 'గని'
  • 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వాయిదాపడే ఛాన్స్
  • త్వరలోనే రానున్న స్పష్టత  

పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'ను ముందుగా ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు ఆ తేదీ వైపు చూసే సాహసం ఎవరూ చేయలేదు. ఆ తరువాత ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని మేకర్స్ చెప్పడంతో, శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. వరుణ్ తేజ్ 'గని' ఆ డేట్ ను ఖరారు చేసుకున్నాయి.

ఈ రెండు సినిమాలు ఇక ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని అనుకుంటూ ఉండగా, 'భీమ్లా నాయక్' తన ప్లాన్ మార్చుకుని ఈ నెల 25న రావాలని నిర్ణయించుకున్నాడు. దాంతో 'గని' టీమ్ ఆలోచనలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను కూడా వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతానికైతే వాళ్లు అదే డేట్ తో కూడిన పోస్టర్లను వదులుతూ వెళుతున్నారు. రిలీజ్ డేట్ కి సంబంధించిన వాయిదా విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Pavan Kalyan
Rana Daggubati
Bheemla Nayak Movie
  • Loading...

More Telugu News