Rajvardhan Hangargekar: తండ్రి కలను నెరవేర్చిన ధోనీ వీరాభిమాని హంగర్గేకర్

Die hard fan of MS Dhoni Rajvardhan Hangargekar realises late fathers dream by bagging CSK contract

  • సీఎస్కేకు ఎంపిక కావడం పట్ల సంతోషం
  • ధోనీ అంటే హంగర్గేకర్ తండ్రికి ఎంతో ఇష్టం
  • సీఎస్కేకు తన కుమారుడు ఆడాలన్న కోరిక
  • ఆయన లేపోయినా కల నెరవేరుతున్న సందర్భం

ఫాస్ట్ బౌలింగ్ యువ కిరణం, మహారాష్ట్రకు చెందిన బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్ ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు ఎంపిక చేసుకోవడం అతడి కలనే కాదు, అతడి తండ్రి కలను కూడా నెరవేర్చేలా చేసింది.

అండర్-19 ప్రపంచకప్ లో మంచి ప్రతిభ చూపించిన ఈ కుర్రాడిని సీఎస్కే జట్టు 1.5 కోట్లకు వేలంలో కొనుగోలు చేయడం గమనార్హం. 140 కిలోమీటర్ల బౌలింగ్ వేగంతో అతడు ధోనీ దృష్టిలో పడ్డాడు. అంతేకాదు, బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉంది. దీంతో ముంబై జట్టుతో పోటీ పడి మరీ అతడ్ని సొంతం చేసుకుంది.

దీనిపై హంగర్గేకర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ ధోనీకి వీరాభిమానిని. మా నాన్న సీఎస్కే ను ఎంతో ఇష్టపడేవారు. ఆయన ధోనీని ఎంతో ప్రేమించే వారు. నన్ను సీఎస్కే జట్టుకు ఆడాలని కోరుకునే వారు. అందుకే, సీఎస్కే ఫ్రాంచైజీతో కలసి ఆడే అవకాశం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను.

ప్రతి ఒక్కరూ ఐపీఎల్ లో ఆడాలనుకుంటారు. వేలంలో నా పేరు వచ్చినప్పుడు ధర చూసి నాలో ఎంతో ఉత్సాహం వచ్చింది. నా కోసం ముంబై ఇండియన్స్, సీఎస్కే పోటీ పడడం అన్నది నాకు గొప్ప సందర్భం’’ అని హంగర్గేకర్ చెప్పాడు.

నైపుణ్యాల విషయానికొస్తే తాను ఎవరి నుంచి అయినా నేర్చుకుంటానని చెప్పాడు. కానీ, ధోనీ మైండ్ సెట్ గురించి చెబుతాడని పేర్కొన్నాడు. తాను ప్రశాంతంగా వింటానని, అటువంటి అవకాశం అంత తరచుగా రాదనీ అన్నాడు. 2020లో కరోనాతో హంగర్గేకర్ తండ్రి మరణించారు. అయినా ఆ బాధ నుంచి కోలుకుని గతేడాది అండర్-19 ప్రపంచ కప్ తో సత్తా చూపించాడు.

  • Loading...

More Telugu News