Pushpa: 'పుష్ప' పాటలకు అదిరిపోయే స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్ అర్ధాంగి

Chahal wife Dhanasri dances for Pushpa songs

  • ఇంకా ప్రకంపనలు రేపుతున్న పుష్ప
  • బన్నీ పెర్ఫార్మెన్స్ కు క్రికెటర్లు ఫిదా
  • పుష్ప పాటల పట్ల విపరీతమైన ఆసక్తి
  • వీడియో పంచుకున్న చహల్ భార్య ధనశ్రీ

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా అనేక వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. క్రికెటర్లు అయితే పుష్ప పాటలకు, బన్నీ స్టెప్పులకు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. కాగా, టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ అర్ధాంగి, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మ... పుష్ప చిత్రంలోని 'ఊ అంటావా మామా ఊఊ అంటావా', 'ఏయ్ బిడ్డా' పాటలకు ఎంతో హుషారుగా స్టెప్పులేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియోను ధనశ్రీ వర్మ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News