Sharwanand: వెంకటేశ్ కి చెప్పిన కథ ఇది కాదు: కిశోర్ తిరుమల

Adavallu Meeku Joharlu movie update

  • వెంకీతో సినిమా చేయాలనుకున్నాను
  • కొన్ని కారణాల వలన కుదరలేదు
  • ఈ టైటిల్ ఆయన కోసం అనుకున్నదే
  • ఆయనతో సినిమా చేయడం ఖాయమన్న కిశోర్ తిరుమల  

ప్రేమకథలను ఫ్యామిలీ ఎమోషన్స్ తో జోడిస్తూ ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు కిశోర్ తిరుమల సిద్ధహస్తుడు. 'నేను శైలజ' .. 'చిత్రలహరి' సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సిద్ధమవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

కొంతకాలం క్రితం వెంకటేశ్ కి కిశోర్ తిరుమల ఒక కథ చెప్పాడనీ, వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉందనే టాక్ వచ్చింది. వెంకటేశ్ తో ప్రాజెక్టు వర్కౌట్ కాకపోవడంతో, అదే కథతో శర్వానంద్ ను ఒప్పించి చేశాడనే ప్రచారం జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో కిశోర్ తిరుమల ఈ విషయంపై స్పందించాడు.

"వెంకటేశ్ గారితో ఇదే టైటిల్ తో నేను సినిమా చేయాలనుకున్నానుగానీ కుదరలేదు. అయితే ఆయనకి చెప్పిన కథ మాత్రం ఇది కాదు. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా వేరే కథను రెడీ చేశాను. వెంకటేశ్ సినిమా చేయాలనే ఆలోచన మాత్రం అలాగే ఉంది. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.

Sharwanand
Rashmika Mandanna
Kishore Thirumala
Adavallu Meeku Joharlu Movie
  • Loading...

More Telugu News