Revanth Reddy: కేసీఆర్ జన్మదినం పేరుతో టీఆర్ఎస్ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy slams TRS leaders in KCR Birthday

  • నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు
  • కొడంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరిగిందన్న రేవంత్
  • స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి చేశాడని ఆరోపణ
  • డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

కేసీఆర్ పుట్టినరోజు పేరుతో టీఆర్ఎస్ నేతల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ సానుభూతిపరులపై పోలీసుల సమక్షంలోనే స్వయంగా ఎమ్మెల్యే దాడి చేయడం అటవిక చర్య అని విమర్శించారు.

కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. అంతకుముందు, రేవంత్ ట్విట్టర్ లో ఊసరవెల్లి ఫొటో పోస్టు చేసి "జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

Revanth Reddy
KCR
Birthday
TRS
Congress
Kodangal
Telangana
  • Loading...

More Telugu News