Nara Lokesh: ఇక ఉద్యోగాల జాతరేనని డప్పుకొడుతున్నారు: లోకేశ్ వ్యంగ్యం

lokesh slams ycp

  • జ‌గ‌న్, ఆయ‌న మ‌నుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి పోనిచ్చుకోరు
  • దుబాయ్ ఎక్స్ పో వేదిక‌గా ఖాళీకుర్చీల‌తో మంత్రి మేక‌పాటి ఎంవోయూ
  • అనామ‌కులు పెట్టిన ఈ కంపెనీ రూ.3 వేల కోట్ల పెట్టుబ‌డి పెడుతుంద‌ట‌ అన్న లోకేశ్‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ఎన్ని కేసులు మెడ‌కి చుట్టుకున్నా వైఎస్ జ‌గ‌న్, ఆయ‌న మ‌నుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదిక‌గా ఖాళీకుర్చీల‌తో గౌర‌వ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మేక‌పాటి గౌతమ్ పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు.

అందులో ఒక‌టి  2021, జూన్ 4న ల‌క్ష రూపాయ‌ల పెట్టుబ‌డితో రిజిస్ట‌ర్ అయిన‌ కాజిస్ ఈ-మోబిలిటి ప్రైవేట్ లిమిటెడ్ ఒక‌టి. ఏడాది కూడా కాని అనామ‌కులు పెట్టిన ఈ కంపెనీ రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెడుతుంద‌ని, ఇక ఉద్యోగాల జాతరేనని డప్పుకొడుతున్నారు.

పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జ‌రిగిన ఒప్పందంలో 300 హై ఎండ్ జాబ్స్ అట‌. అంత హై ఎండ్ అంటే వ‌లంటీర్లే క‌దా! ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 గారి సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుంది. ఫేక్ పార్టీ, ఫేక్ పాల‌న, ఫేక్ మాట‌లు, ఫేక్ రాత‌లు, చివ‌రికి అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద కూడా ఫేక్ ఎంవోయూలు. తూ... మీ బ‌తుకు చెడ‌ అని వైసీపీ నాయకుల్ని ప్రజలు చీత్కరించుకోవడంలో తప్పేముంది? అని నారా లోకేశ్ ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News