YSRCP: సొంతపార్టీపై విరుచుకుపడిన వైసీపీ యూత్ రాష్ట్ర నేత ప్రేమ్ కుమార్

YCP Youth leader prem kumar fires on own party

  • మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
  • దాని నిధులను ‘నవరత్నాల’కు మళ్లించింది
  • జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో గెంటివేయించారు
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతాం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యర్శి ప్రేమ్ కుమార్ సొంత పార్టీపైనే విరుచుకుపడ్డారు. తమ పార్టీ మాదిగలను తీవ్రంగా మోసగించిందని ఆరోపించారు. గుంటూరు జల్లా అమృతలూరు మండలం పెదపూడిలో నిన్న జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్భాటంగా మాదిగ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రెండున్నరేళ్లు అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన నిధులను ‘నవరత్నాల’కు మళ్లించిందని ఆరోపించారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో గెంటివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ జాతిని మోసం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

YSRCP
Andhra Pradesh
Madiga Coroporation
Prem Kumar
  • Loading...

More Telugu News