Mahesh Babu: మహేశ్ సినిమాలో పూజ హెగ్డే చెల్లిగా శ్రీలీల!

Sreeleela in Trivikram movie

  • 'పెళ్లి సందD'తో శ్రీలీల పరిచయం
  • సెట్స్ పై రెండో సినిమాగా 'ధమాకా'
  • లైన్లో వైష్ణవ్ తేజ్ మూవీ
  • ప్రభాస్ జోడీగాను ఛాన్స్ అంటూ టాక్  

ఈ మధ్య కాలంలో కృతి శెట్టి తరువాత తెలుగు తెరకి పరిచయమైన అందాల కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పాలి. 'పెళ్లి సందD' సినిమాతో ఈ బ్యూటీ కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. అందువల్లనే ఈ సుందరికి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి.

తన రెండవ సినిమానే రవితేజ సరసన చేస్తున్న ఈ భామ, ఆ తరువాత వైష్ణవ్ తేజ్ .. నవీన్ పోలిశెట్టి సినిమాలను కూడా లైన్లో పెట్టేసింది. ఇక త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కథానాయిక పూజ హెగ్డే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

ఈ సినిమాలో పూజ హెగ్డే చెల్లెలి పాత్ర కోసం శ్రీలీలను అడిగారట. అయితే ఆమె అంతగా ఆసక్తిని చూపకపోవడంతో, ఆమె పాత్ర నిడివిని త్రివిక్రమ్ పెంచాడట. అంతేకాదు .. మహేశ్ బాబుతో ఒక పాట కూడా ఉండేలా ప్లాన్ చేయడంతో ఆమె సంతృప్తి చెందిందని అంటున్నారు. ఇక ప్రభాస్ - మారుతి సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుండటం విశేషం.

Mahesh Babu
Pooja Hegde
Sreeleela
Trivikram Movie
  • Loading...

More Telugu News