Charminar: తవ్వకాల్లో బయటపడిన చార్మినార్ భూగర్భ మెట్లు

Underground steps of charminar came into light

  • పిడుగుపాటు నుంచి చార్మినార్‌ను రక్షించే ప్రయత్నాలు
  • మీనార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు
  • తవ్వకాలు ఎందుకు చేపట్టారని నిలదీసిన మజ్లిస్ నేతలు.. ఉద్రిక్తత 
  • అధికారుల వివరణతో వెనక్కి తగ్గిన నేతలు  

చార్మినార్ వద్ద చేపట్టిన తవ్వకాల్లో భూగర్భ మెట్లు బయటపడ్డాయి. విషయం తెలిసిన పత్తర్‌గట్టీ కార్పొరేటర్ సోహెల్‌ఖాద్రీతోపాటు మజ్లిస్ నేతలు అక్కడికి చేరుకుని తవ్వకాలపై అధికారులను ప్రశ్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పురాతత్వ సర్వేక్షణ విభాగం హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ స్మిత, చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి తవ్వకాల వెనకున్న కారణాలను వివరించడంతో నేతలు వెనక్కి తగ్గారు.

చార్మినార్‌ను పిడుగు ప్రమాదం నుంచి రక్షించేందుకు పురాతత్వ అధికారులు గత కొన్ని రోజులుగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు మీనార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేసి వాటిని భూమికి అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టారు. జనరేటర్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం తవ్వకాలు చేపట్టగా భూమిలో కూరుకుపోయిన మెట్లు బయటపడ్డాయి.

Charminar
Hyderabad
Under Ground Stps
MIM
  • Loading...

More Telugu News