Congress: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. 46 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్!

Only See Congress Going Downhil Ashwani Kumar

  • సోనియాగాంధీకి రాజీనామా లేఖ
  • కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత దిగజారిపోతుందన్న అశ్వనీకుమార్ 
  • అధినేతగా చెప్పుకుంటున్న వ్యక్తికి ప్రజల నుంచి ఆమోదం లభించడం లేదంటూ వ్యాఖ్య 
  • తాను ఏ పార్టీలోనూ చేరాలనుకోవడం లేదని స్పష్టీకరణ 

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ (69) నిన్న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌తో ఆయన 46 ఏళ్ల బంధం తెగిపోయింది. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. పార్టీకి దూరంగా ఉంటేనే జాతీయ ప్రయోజనాల కోసం మరింత మెరుగ్గా ఉండగలనని భావిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఓ మీడియా సంస్థతో అశ్వనీకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో ఆ పార్టీ మరింతగా దిగజారే అవకాశం ఉందన్నారు. పార్టీ అధినేతగా చెప్పుకుంటున్న వ్యక్తికి ప్రజల ఆమోదం లభించడం లేదన్నారు. ప్రధాని మోదీ పనితీరు విషయంలో ప్రజలు సంతృప్తిగా లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయడం లేదన్న ప్రశ్న పదేపదే ఉత్పన్నమవుతోందన్నారు.

చాలామంది సీనియర్ నేతలు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పారు. పార్టీలో వారికి తీరని అవమానాలు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, తనలాగా బయటకు వచ్చే శక్తి ఎంతమందికి ఉందన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్న ఆయన.. తాను ఏ పార్టీలోనూ చేరకపోవచ్చని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News