HD Devegowda: కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్... బీజేపీ వ్యతిరేక పోరుకు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడి

Former PM Devegowda talks to CM KCR via phone

  • కేంద్రంపై కేసీఆర్ యుద్ధం
  • గత కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు
  • కేసీఆర్ తో దేవెగౌడ ఫోన్ సంభాషణ
  • యుద్ధం కొనసాగించాలని సూచన

గత కొన్నిరోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగే పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రాన్ని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కు రాజకీయ దిగ్గజం హెచ్ డీ దేవెగౌడ నుంచి మద్దతు లభించింది. జనతాదళ్ (సెక్యూలర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ నేడు సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.

దేశంలో మతతత్వ రాజకీయాలపై పోరాడుతున్నారంటూ కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు దేవెగౌడ స్పష్టం చేశారు. లౌకికవాద పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అండగా ఉంటామని, యుద్ధాన్ని కొనసాగించాలని కేసీఆర్ కు సూచించారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చించారు.

HD Devegowda
CM KCR
Phone
BJP
NDA
TRS
Janatadal S
Telangana
Karnataka
India
  • Loading...

More Telugu News