Raviteja: లెక్చరర్ గా రవితేజ .. స్టూడెంట్ గా శ్రీలీల!

Dhamaka movie update

  • రీసెంట్ గా రిలీజ్ అయిన 'ఖిలాడి'
  • ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • 'ధమాకా'లో డ్యూయెల్ రోల్
  • దర్శకుడిగా త్రినాథరావు నక్కిన

ఈ ఏడాదిలో తన మొదటి సినిమాగా 'ఖిలాడి'ని వదిలిన రవితేజ, ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ'ని థియేటర్లకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'ధమాకా' సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక పాత్రలో ఆయన లెక్చరర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఆయన ప్రేమలో పడే స్టూడెంట్ గా శ్రీలీల కనిపిస్తుందని చెబుతున్నారు. లెక్చరర్ కీ .. స్టూడెంట్ కి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

మాస్ అభిమానులకు నచ్చే రవితేజ మార్కు సినిమా ఇది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందని చెబుతున్నారు. ఆ పాత్రకి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. అభిషేక్ అగర్వాల్ .. వివేక్ కూచిభొట్ల .. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Raviteja
Sreeleela
Nakkina Trinadha Rao
Dhamaka Movie
  • Loading...

More Telugu News