bheemla naik: 'భీమ్లా నాయక్' సినిమా కోసం టికెట్‌కు డబ్బులు ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న బాలుడు
![student commits suicide](https://imgd.ap7am.com/thumbnail/cr-20220215tn620b444aad097.jpg)
- జగిత్యాలలో విషాద ఘటన
- 8వ తరగతి చదువుతోన్న బాలుడు
- రూ.300 కావాలని తండ్రిని అడిగిన కొడుకు
- స్నేహితులు టికెట్లు బుక్ చేసుకుంటారని చెప్పిన బాలుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న ఈ సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకుందామని భావించాడు ఓ బాలుడు. అయితే, అందుకు డబ్బులు లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు. జగిత్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నవదీప్(11) అనే బాలుడు 8వ తరగతి విద్యార్థి భీమ్లా నాయక్ సినిమా టికెట్ బుకింగ్ కోసం తన తండ్రిని 300 రూపాయలు అడిగాడు. తన స్నేహితులు కూడా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారని చెప్పాడు. అయితే, తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన నవదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.