Raviteja: నైజామ్ లో 'ఖిలాడి' 3 రోజుల వసూళ్లు!

Khiladi movie update

  • ఈ నెల 11వ తేదీన వచ్చిన 'ఖిలాడి'
  • రవితేజ సరసన ఇద్దరు భామలు
  • దర్శకుడిగా రమేశ్ వర్మ  
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్

రవితేజ హీరోగా రమేశ్ వర్మ 'ఖిలాడి' సినిమాను తెరకెక్కించాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

మొదట మూడు రోజుల్లో ఈ సినిమా నైజామ్ లో 2.4 కోట్ల షేర్ ను రాబట్టింది. రవితేజ రేంజ్ కి ఈ వసూళ్లు తక్కువే అయినప్పటికీ, దగ్గరలో మాస్ ఎంటర్టైనర్ లు ఏమీ లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశమని చెబుతున్నారు. ఇలా లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత మొత్తం రాబడుతుందనేది చూడాలి.

రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి .. డింపుల్ హయతి అందాల సందడి చేశారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలు ఉండేలా రమేశ్ వర్మ చూసుకున్నాడు. ఇక డైలాగ్స్ కి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ సినిమా తరువాత రవితేజ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raviteja
Meenakshi
Dimple hayathi
Khiladi Movie
  • Loading...

More Telugu News