thaman: గుండె త‌రుక్కుపోతోంది.. మ‌న‌సు చాలా బాధ‌గా ఉంది: థ‌మ‌న్ వ్యాఖ్య‌ల వీడియో ఇదిగో

thaman on audio leak

  • సర్కారువారి పాట సినిమాలోని క‌ళావ‌తి పాట ఆన్‌లైన్‌లో లీక్
  •  ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు
  • ఆర్నెల్లుగా ఈ వీడియో కోసం ఎంతో కష్టపడ్డాం
  • కొవిడ్ వేళ రాత్రి, పగలు అందరం కలిసి శ్రమించాం

సూపర్ స్టార్ మహేశ్ బాబు న‌టించిన‌ సర్కారువారి పాట సినిమాలోని క‌ళావ‌తి పాట ఆన్‌లైన్‌లో లీకైన విష‌యం తెలిసిందే. దీనిపై థ‌మ‌న్ వీడియో రూపంలో స్పందించారు. మ‌న‌సు చాలా బాధగా ఉందని, త‌న‌కు ఏం చెప్పాలో అర్థం కావట్లేదని అన్నారు. ఎంతో కష్టప‌డ్డామ‌ని, ఆర్నెల్లుగా ఈ వీడియో కోసం ఎంతో కష్టపడ్డామ‌ని, కొవిడ్ వేళ రాత్రి, పగలు అందరం కలిసి శ్రమించామ‌ని చెప్పారు.

ఆ స‌మ‌యంలో ఎనిమిది తొమ్మిది మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని, అయినప్ప‌టికీ ఈ పాట‌ కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. నిర్మాత పెట్టుబ‌డి, తాము త‌మ‌ హీరోకి చూపించాల్సిన ప్రేమ, అభిమానం మా పాటలో ఉంటుంద‌ని అన్నారు. ఈ పాట‌కు అద్భుతమైన లిరిక్స్ రాశార‌ని, డైరెక్టర్ ఎంతో సంతోష ప‌డ్డార‌ని చెప్పారు.  

ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో ప్ర‌పంచంలోనే బెస్ట్ అనేలా చేశామ‌ని తెలిపారు. ఈ పాటకు ఎంతో టెక్నాలజీని వాడామ‌ని అన్నారు. ఎవడో త‌మ‌ ప్రాణాలని తీసుకుని చాలా చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో  పెట్టేశాడని థ‌మ‌న్ ఆవేద‌నాభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు.

thaman
Sarkaru Vaari Paata
Mahesh Babu
  • Error fetching data: Network response was not ok

More Telugu News