Himanta Biswa Sarma: కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం హిమంత బిస్వా

Himanta Biswa counter attack on KCR

  • రాహుల్ రాజీవ్ కుమారుడే అని అనడానికి బీజేపీ రుజువులు అడిగిందా అన్న హిమంత
  • హిమంతను బర్తరఫ్ చేయాలన్న కేసీఆర్
  • గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా అని ప్రశ్నించిన హిమంత

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ.. రాజీవ్ గాంధీ కుమారుడే అని చెప్పడానికి బీజేపీ ఎప్పుడైనా రుజువులు అడిగిందా? అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇంత దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, రాహుల్ తాత నెహ్రూ ప్రధానిగా పని చేశారని... అలాంటి కుటుంబం గురించి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదేనా బీజేపీ మాట్లాడే ధర్మం, హిందుత్వం అని ప్రశ్నించారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు హిమంతి బిస్వా కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడిగారని, బిపిన్ రావత్ మరణంపై వ్యాఖ్యలు చేశారని... అలాంటి వ్యక్తి గురించి తాము మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా? అని అడిగారు. కేసీఆర్ కు కేవలం తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా? అని ప్రశ్నించారు.

Himanta Biswa Sarma
Odisha
BJP
KCR
TRS
  • Loading...

More Telugu News