Naresh: జగన్ ను కలిసిన చిరంజీవి బృందంపై నరేశ్ ట్వీట్

Actor Naresh tweet on Actors meeting with Jagan

  • జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ప్రశంసించదగ్గది
  • ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం ఫిలిం ఛాంబర్ వర్క్ షాప్ అవసరం
  • త్వరలోనే వర్క్ షాప్ జరుగుతుందన్న నరేశ్ 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ప్రశంసించదగ్గదని ప్రముఖ సినీ నటుడు నరేశ్ కొనియాడారు. అయితే ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం ఒక వర్క్ షాప్ పెట్టడం చాలా అవసరమని అన్నారు. ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా, అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మానాలను జారీ చేయాలని చెప్పారు. త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు. మరోవైపు సినీ ప్రముఖులతో చర్చలు జరిపిన సందర్భంగా ఐదో షో వేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ అంగీకరించిన సంగతి తెలిసిందే.

Naresh
Tollywood
Film Actors
Jagan
YSRCP
  • Loading...

More Telugu News