Special Committee: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సలహాలు, సూచనల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

Special Committee for new districts in AP

  • ఏపీలో 26 జిల్లాలు
  • ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు!
  • విజ్ఞప్తుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ
  • సిఫారసులు చేయనున్న కమిటీ

ఏపీలో ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటారు. కాగా, ఈ కమిటీకి విజ్ఞప్తులు చేసేందుకు ప్రజలకు 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ విజ్ఞప్తులను కలెక్టర్లు సేకరిస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ (drp.ap.gov.in)కు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుండాలి.

ఈ విజ్ఞప్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే సిఫారసు చేస్తుంది. ఒకవేళ, విజ్ఞప్తులు అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తే తిరస్కరించాలని సదరు రాష్ట్రస్థాయి కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫారసులపై అంతిమ నిర్ణయం మాత్రం సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీదే. ఉగాది నుంచి కొత్త జిల్లాలు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News