sikhar dhavan: ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ దూకుడు.. ధావన్, రబాడా సొంతం.. కేకేఆర్ కు అయ్యర్
- ధావన్ కు 8.25 కోట్లు
- రబాడాకు 9.25 కోట్లు
- కేకేఆర్ కు శ్రేయాస్ అయ్యర్
- ప్యాట్ కమిన్స్ మళ్లీ అదే జట్టుకు
బెంగళూరులో ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. మొదటిగా పంజాబ్ కింగ్స్ జట్టు.. ఓపెనర్, విధ్వంసకర బ్యాట్స్ మ్యాన్ శిఖర్ ధావన్ ను 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా, ఢిల్లీ క్యాపిటల్స్ అతడ్ని వేలానికి వదిలేసింది. దీంతో నిలకడైన ఆటతీరును ప్రదర్శించే ధావన్ ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
అంతేకాదు దక్షిణాఫ్రికా బౌలింగ్ స్టార్ కగిసో రబాడను కూడా పంజాబ్ కింగ్స్ వేలంలో గెలుచుకుంది. అతడికి 9.25 కోట్లను ఆఫర్ చేసింది. జాస్ బట్లర్, రవిచంద్ర అశ్విన్ లు వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతమయ్యారు.
మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ కు అదృష్టం కలిసొచ్చింది. రిటెన్షన్ విధానం కారణంగా వదులుకున్న ప్యాట్ కమిన్స్ ను గతంతో పోలిస్తే సగం ధరకే తిరిగి దక్కించుకుంది. గతంలో అతడికి రూ.15.5 కోట్లను ఫ్రాంచైజీ ఇవ్వగా.. తాజా ఆఫర్ రూ.7.25 కోట్లే. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ కు మాజీ సారథి అయిన శ్రేయాస్ అయ్యర్ ను 12.25 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.