Jagan: హైద‌రాబాద్ వ‌చ్చిన ఏపీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్ దంప‌తులు

jagan visits hydeabad

  • మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో బొత్స కుమారుడి పెళ్లి
  • తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు జగన్
  • వధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం

ఆంధ్రప్ర‌దేశ్ సీఎం వైఎస్‌ జగన్ హైదరాబాద్ వ‌చ్చారు. న‌గ‌రంలోని మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఏపీ మంత్రి బొత్స కుమారుడి వివాహం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌య‌మే ఏపీలోని తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు జగన్ త‌న అర్ధాంగి భార‌తితో కలిసి బయల్దేరి వ‌చ్చారు.
                                 
బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు హాజరైన జగన్‌ దంపతులు వధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలకు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా, ఈ వేడుక‌కు ప‌లు పార్టీల నేత‌లు భారీగా హాజ‌ర‌వుతున్నారు.  
          

Jagan
YSRCP
Andhra Pradesh
Telangana
Hyderabad
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News