Alia Bhatt: మానసికంగా చాలా కాలం క్రితమే అతనితో నా పెళ్లి అయిపోయింది: అలియా భట్

In my mind Ranbeer is my husband says Alia Bhatt
  • ప్రేమలో మునిగి తేలుతున్న రణబీర్, అలియా భట్
  • కరోనా కారణంగా వాయిదా పడ్డ పెళ్లి ఆలోచన
  • తన మైండ్ లో తన భర్త రణబీరే అన్న అలియా
బాలీవుడ్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, అలియా భట్ లు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు 2020లో ఓ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ కరోనా రాకపోయినట్టయితే తామిద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్లమని తెలిపాడు.

ఈ విషయాన్ని అలియా కూడా అంగీకరించింది. కరోనా మహమ్మారి తమ పెళ్లి పనులను పాడు చేసిందని చెప్పింది. తాజాగా ఆమె స్పందిస్తూ, రణబీర్ తో మానసికంగా తన పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని తెలిపింది. తన మైండ్ లో ఆయన తన భర్త అని చెప్పింది.
Alia Bhatt
Ranbeer Kapoor
Love
Marriage
Bollywood

More Telugu News