Nara Lokesh: జగన్ ఆక‌లికి గిరిజ‌నులు బ‌లి అవుతున్నారు: నారా లోకేశ్

Tribes are suffering due to Jagan says Nara Lokesh

  • నాన్ షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపలేదు
  • ఖనిజ నిక్షేపాల దోపిడీ కోసం ఈ ప్రాంతాలను కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు
  • కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి

ముఖ్యమంత్రి జగన్ ఆకలికి రాష్ట్రంలో గిరిజనులు బలి అవుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు నివసిస్తున్న నాన్ షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తించాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను పంపలేదని కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని విమర్శించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 554 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలున్నాయని... ఆయా ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజ నిక్షేపాల దోపిడీ కోసమే ఈ ప్రాంతాలను వైసీపీ పెద్దలు తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారని మండిపడ్డారు.

నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లోని గిరిజనులు మౌలిక వసతులు, అభివృద్ధి, హక్కులు, రక్షణ, విద్య, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలు, భూముల క్రయవిక్రయాలు వంటి వాటిలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని లోకేశ్ అన్నారు. తక్షణమే సమస్య పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News