Rajanikanth: రజనీ 169వ సినిమా డైరెక్టర్ అతనే .. వీడియో రిలీజ్!

Rajani New Movie Ennouncement

  • రజనీ నుంచి 169వ సినిమా 
  • నిర్మాణ సంస్థగా సన్ పిక్చర్స్ 
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్

రజనీకాంత్ నుంచి ఇటీవల తమిళంలో 'అన్నాత్తే' వచ్చింది. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా తెలుగులో 'పెద్దన్న' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రెండు భాషల్లోని ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది.

అయినా సన్ పిక్చర్స్ వారు రజనీతో మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక రజనీ తరువాత సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఉండనున్నట్టు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. ఆ వార్త నిజమేనని చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ తో పాటు, చిన్నపాటి వీడియోను కూడా వదిలారు.

సన్ పిక్చర్స్ వారు వదిలిన ఈ వీడియోలో రజనీ .. నెల్సన్ దిలీప్ కుమార్ .. అనిరుధ్ కనిపిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి విజయ్ 'బీస్ట్' సిద్ధంగా ఉంది. త్వరలోనే రజనీ ప్రాజెక్టుతో ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News