Chiranjeevi: విమానంలో సినీ ప్ర‌ముఖులు.. జూ.ఎన్టీఆర్ మిస్సింగ్.. ఫొటో వైర‌ల్

chiru pic goes viral

  • జ‌గ‌న్‌తో భేటీకి వెళ్తూ ఫొటో
  • మ‌హేశ్‌కి పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు
  • పుష్ప‌గుచ్చం అందించిన సినీ ప్ర‌ముఖులు

ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. అయితే, అంత‌కుముందు ఈ స‌మావేశంలో పాల్గొన‌డానికి చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యం నుంచి విమానంలో వెళ్లారు. విమానంలో వారు దిగిన ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ రోజు మ‌హేశ్ బాబు పెళ్లి రోజు ఉండ‌డంతో ఆయ‌న‌కు విమానంలోనే చిరంజీవి, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ శుభాకాంక్ష‌లు తెలుపుతూ పుష్ప‌గుచ్చం అందించారు.

కాగా, జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఈ స‌మావేశానికి హాజరవుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, విమానంలో సినీ ప్ర‌ముఖులు దిగిన ఫొటోలో జూనియ‌ర్ ఎన్టీఆర్ లేక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు నిరాశ‌కు గుర‌వుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, సినీ ప్ర‌ముఖులు విమానాశ్ర‌యానికి వ‌చ్చిన స‌మ‌యంలో తీసిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.  
                    

Chiranjeevi
Tollywood
Junior NTR
  • Error fetching data: Network response was not ok

More Telugu News