Raviteja: నా ఫేవరేట్ హీరో రవితేజనే: డింపుల్ హయతి

Khiladi movie update

  • రవితేజ జోడీగా ఛాన్స్ రావడం అదృష్టం
  • ఆయన ఎనర్జీని అందుకోవడం కష్టం
  • ఈ సినిమాతో ఎంతో నేర్చుకున్నాను
  • రమేశ్ వర్మకి థ్యాంక్స్ అని చెప్పిన డింపుల్  

రవితేజ హీరోగా రూపొందిన 'ఖిలాడి' సినిమాలో డింపుల్ హయతి ఒక కథానాయికగా నటించింది. నిన్నరాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ .. "నేను 'గద్దలకొండ గణేశ్' సినిమాలో 'జర్రా జర్రా' సాంగ్ లో మెరిశాను. ఆ తరువాత నుంచి ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నాను.

పూర్తిస్థాయి కథానాయికగా కనిపించాలనే నా కోరిక 'ఖిలాడి' సినిమాతో నెరవేరింది. మీ అందరిలానే నేను కూడా రవితేజ గారికి వీరాభిమానిని. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఆయన ఎనర్జీని అందుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. అయినా నా ప్రయత్నం నేను చేశాను.

ఆయన పనిగట్టుకుని ఏదీ చెప్పలేదు గానీ, ఆయనతో మాట్లాడటం వలన నేను అనేక విషయాలను తెలుసుకున్నాను. ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను మరింత బాగా చేయడానికి తగిన కంఫర్టును ఇచ్చారు. ఈ పాత్ర కోసం నన్ను ఎంచుకున్న దర్శకుడు రమేశ్ వర్మగారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 11న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చింది.

Raviteja
Meenakshi
Dimple Hayathi
Khiladi Movie
  • Loading...

More Telugu News