Pavan kalyan: మరో డైరెక్టర్ కి పవన్ గ్రీన్ సిగ్నల్?

Pavan in Ramesh Varma Movie

  • విడుదలకి రెడీగా 'భీమ్లా నాయక్'
  • ముగింపు దశలో 'వీరమల్లు'
  • త్వరలో సెట్స్ పైకి 'భవదీయుడు భగత్ సింగ్'
  • లైన్లో సురేందర్ రెడ్డి, రమేశ్ వర్మ  

ప్రస్తుతం పవన్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భీమ్లా నాయక్' రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఆ తరువాత సినిమాగా పవన్ 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది.

తదుపరి షెడ్యూల్ కి అవసరమైన సెట్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నెలలోనే మళ్లీ పవన్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నారు. 'భవదీయుడు భగత్ సింగ్' టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా తరువాత  లైన్లో సురేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తరువాత ప్రాజెక్టును కూడా పవన్ లైన్లో పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 'ఖిలాడి' దర్శక నిర్మాతలతో ఒక సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Pavan kalyan
Sathyanaratana Koneru
Ramesh varma Movie
  • Loading...

More Telugu News