Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 657 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 197 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ మారుతి సుజుకి షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలు మన ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు వివిధ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. ఇది కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 657 పాయింట్లు లాభపడి 58,466కి చేరుకుంది. నిఫ్టీ 197 పాయింట్లు పుంజుకుని 17,463 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (4.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.02%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.77%), టైటాన్ (1.72%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-0.72%), ఐటీసీ (-0.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.38%).

  • Loading...

More Telugu News