Raviteja: 'ఖిలాడి' కోసం అరగంటలో ఆరు పాటలు చేసిన దేవిశ్రీ ప్రసాద్!

Khiladi movie update

  • రమేశ్ వర్మ నుంచి 'ఖిలాడి'
  • రవితేజ మార్క్ సినిమా
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • ఈ నెల 11వ తేదీన సినిమా రిలీజ్

రవితేజ -  రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన సింగిల్స్ ఫరవాలేదనిపించుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రమేశ్ వర్మ మాట్లాడాడు.

"ఈ సినిమా కథ చెప్పడానికి దేవిశ్రీ దగ్గరికి వెళితే .. కథ వినడానికి ఆయనకి అర్థరాత్రి వరకూ కుదరలేదు. ఆయనకి కథ మొత్తం చెప్పేసరికి తెల్లవారు జామున 3 .. 3:30 గంటలు దాటింది. ఆయా సందర్భాల గురించి చెప్పగానే అందుకు తగినట్టుగా ఆయన అరగంటలో 6 ట్యూన్లు ఇచ్చేశారు. దేవిశ్రీ అంత ఫాస్టుగా ట్యూన్లు ఇవ్వడంతో నేను షాక్ అయ్యాను. ఆ 6 ట్యూన్లలో 5 పాటలను సినిమాలో వాడటం జరిగింది" అని చెప్పుకొచ్చాడు.

కానీ అంత తక్కువ సమయంలో చేయడం వల్లనే ఆ పాటలు అలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raviteja
Devisri Prasad
Ramesh varma Movie
  • Loading...

More Telugu News