Malavika: ఆ ఒక్కటీ అడగొద్దన్న సీనియర్ హీరోయిన్ మాళవిక!

Malavika Interview

  • తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన మాళవిక 
  • రజనీ సార్ చాలా సింపుల్
  • కమల్ గారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ 
  • అజిత్ సార్ నా ఫేవరేట్ 
  • విజయ్ గారు సైలెంట్ గా ఉంటారన్న మాళవిక

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'చాలా బాగుంది' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన మాళవిక, తెలుగులో కేవలం 5 సినిమాలు మాత్రమే చేసింది. ఆ తరువాత తమిళ సినిమాలపైనే ఫోకస్ చేసి, అక్కడ 35 సినిమాలు చేసింది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళ స్టార్ హీరోలను గురించి ఇలా స్పందించింది.

రజనీకాంత్ గారితో కలిసి 'చంద్రముఖి' సినిమాలో నటించాను. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఆయనలోని నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఆయనతో కలిసి నటించడం నా కెరియర్లోనే గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇక కమల్ గారు చాలా బ్రిలియంట్ .. చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం.

ఇక అజిత్ ఎక్కువగా మేకప్ వేసుకోరు. షాట్ కీ .. షాట్ కి మధ్య ఫేస్ వాష్ చేసుకుంటారు అంతే. కోలీవుడ్ లో నా ఫేవరేట్ ఆయన. విజయ్ విషయానికి వస్తే ఆయన ఎక్కువగా మాట్లాడరు .. సైలెంట్ గా ఉంటారు" అని చెప్పుకొచ్చారు. ఇక రాజేంద్రప్రసాద్ గురించి అడగ్గానే ఆమె ఒక్కసారిగా నవ్వేశారు. ఈ విషయంపై నేను ఏమీ చెప్పాలనుకోవడం లేదు. ఇప్పటికే చాలా కాంట్రవర్సీ జరిగింది .. ఇక వద్దు" అంటూ దాటేశారు.

Malavika
Ali
Alitho Saradaga
  • Loading...

More Telugu News