Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 53 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన టాటా స్టీల్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. చివరకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 57,808కి చేరుకుంది. నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 17,266 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.10%), బజాజ్ ఫైనాన్స్ (1.74%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.69%), రిలయన్స్ (1.64%), టైటాన్ (1.38%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.02%), టీసీఎస్ (-0.96%), టెక్ మహీంద్రా (-0.62%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.60%).

  • Loading...

More Telugu News