Raviteja: కనిపించని 'ఖిలాడి' ప్రమోషన్స్ సందడి!

Khiladi movie update

  • 'ఖిలాడి'గా రవితేజ
  • దర్శకుడిగా రమేశ్ వర్మ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఈ నెల 11వ తేదీన విడుదల

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా థియేటర్లలో భారీస్థాయిలో విడుదలవుతుందంటే, కనీసం వారం పది రోజుల ముందునుంచే ప్రమోషన్స్ మరింత ఊపందుకుంటాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన విషయాలు .. చీఫ్ గెస్టు ఎవరనే ఆసక్తి .. వేదికపై నుంచి వదిలే ఫైనల్ ట్రైలర్ .. ఇలా అన్ని విషయాలపై అభిమానులు దృష్టి పెడతారు.

అయితే రవితేజ 'ఖిలాడి' సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సందడి సోషల్ మీడియాలో తప్ప బయట కనిపించడం లేదు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల ఉంది. హిందీ వెర్షన్ ను కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్టు  వార్తలు వచ్చాయి. కానీ ఛానల్స్ లో ఎక్కడా కూడా హడావిడి కనిపించడం లేదు.

రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ముచ్చట ఎక్కడా వినిపించడం లేదు. రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే అందుకు కారణమనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, కారణం అది అయ్యుండదనే చాలామంది చెప్పుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కథానాయికలుగా, మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి సందడి చేయనున్నారు.  

Raviteja
Meenakshi
Dimple Hayathi
Khiladi Movie
  • Loading...

More Telugu News