revanth: గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్న సింగ‌ర్ రేవంత్.. ఫొటోలు ఇవిగో

revanth gets married

  • గుంటూరులో నిన్న పెళ్లి
  • సింపుల్‌గా చేసుకున్న రేవంత్
  • కొవిడ్ ప‌రిస్థితులే కారణం
  • హాజ‌రైన ప‌లువురు గాయ‌కులు

టాలీవుడ్ గాయకుడు, ఇండియన్‌ ఐడిల్‌-9 విజేత రేవంత్ కు గుటూరుకు చెందిన అన్విత అనే అమ్మాయితో పెళ్లి జ‌రిగింది. అన్విత‌ మెడ‌లో రేవంత్  మూడు ముళ్లు వేసిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఈ పెళ్లి వేడుక‌ను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుపుకున్నాడు. పలువురు గాయనీగాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. రేవంత్, అన్వితల నిశ్చితార్థం డిసెంబర్‌ 24న జరిగింది. ప‌లువురు సినీ ప్రముఖులు రేవంత్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. త‌న పెళ్లి ఫొటోల‌ను రేవంత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

             
 

  • Loading...

More Telugu News